Congress MP, అగ్రనాయకుడు Rahul Gandhi... National Herald కేసులో ED విచారణకు హాజరు కానున్నారు. రాహుల్ కు మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు, ప్రెస్ మీట్లకు పిలుపునిచ్చింది. దీనికి అనుగుణంగా దిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ వద్ద రాహుల్ కు మద్దతుగా నినాదాలు చేశారు. సత్యమేవ జయతే అన్న నినాదాలతో ప్లకార్డులు పట్టుకున్నారు. హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగురవేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేవరకు ఆందోళన చేస్తూనే ఉంటామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.